ఆడపిల్లలు అన్ని రంగాలలో రాణించాలి

– బీ.బీ.బీ.పీ, మెంటర్‌ రేణుక , జెండర్‌ స్పెషలిస్ట్‌ అనిత
మక్తల్‌: ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని బి.బి.బి.పి, మెంటర్‌ రేణుక , జెండర్‌ స్పెషలిస్ట్‌ అనితలు అన్నారు. మహిళభివద్ధి , శిశు సంక్షేమా శాఖ, బేటి బచవో – బేటి పడావో అధ్వర్యంలో మక్తల్‌ మండలం మై నార్టీ కాలనీలో మైనార్టి కమ్యూనిటి వారితో అవగహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. బేటి బచవో బేటి పడావో పథకం ముఖ్య ఉద్దేశ్యం ఆడపిల్లలను చదివించడం వారిని ఎదగనిద్దాం అని అమ్మాయిలను పుట్టానివ్వలని, అన్ని రంగాలలో రాణించాలి అని చెప్పారు. ఎవరు కుడా చిన్న వయసులో వివాహాలు చేయరాదని, చేసే వారిని కుడా ప్రోత్సహించరాదని అన్నారు. బి.బి.బి.పి, మెంటర్‌ రేణుక , జెండర్‌ స్పెషలిస్ట్‌ అనిత ముస్లిం పెద్దలు ఖాజీ. మహ్మద్‌ సాధిక్‌ మట్లాడుతూ. మా పిల్లల చదువు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని, మైనార్టీ కాలనీలలో పిల్లలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రలను ఏర్పాటు చేసి అన్ని రంగాలలో కమ్యూనిటీి పిల్లలను తీసుకురావడానికి మేము సహకరిస్తాం అని అన్నారు .ఈ కార్యక్రమంలో అమీన్‌ బెగం, సోఫియా బేగం , రిజ్వానా బేగం , కౌసర్‌ బేగం, సాధియ బేగం , పాతీమా , సోఫీయ బేగం, బాలికలు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.