
బాలికలు ఎదగాలి చదవాలని నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. గురువారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మండలంలోని స్వర్ణ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లలు ఎదుకుంటున్న అసమానతల గురించి అవగాహన కల్పించారు. బాలికలు ఆరోగ్యం, పోషకాహారం పై దృష్టి సాధించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాలికలకు సమాన అవకాశాలతోపాటు వారి హక్కులను భంగం కలగకుండా రక్షణ అందిరి బాధ్యత అన్నారు. ముందుగా పాఠశాల అంతా కలియతిరిగి, తరగతి గదులు, స్టాక్ రూమ్, వంటగది, భోజన శాలను పరిశీలించారు. బాలికల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను ఉపాధ్యాయ సిబ్బందికి పలు సూచించారు అనంతరం బాలికలతో కలసి భోజనం చేసారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయ బృందం న్యాయమూర్తిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీత రాణి, వార్డెన్ రాథోడ్ మంగిళల్ ఉపాధ్యాయ బృందం.విద్యార్థులు పాల్గొన్నారు.