
స్వస్థ స్పోర్ట్స్ అకాడమీ- 2024 ఏలూరులోని సర్ సి ఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించింది. ఈ పోటీలను షోటోకాన్ అడ్వాన్స్‌డ్ కరాటే డో ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ జపాన్ షోటోకాన్ కరాటే డో కన్నింజుకు సంస్థ నిర్వహించాయి. ప్రజ్ఞా స్రవంతి 8 సంవత్సరాల లోపు బాలికల కరాటే విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. జ్ఞాన వైశాలి 14 సంవత్సరాల లోపు బాలికల కరాటే విభాగంలో బంగారు పతకాన్ని, కుమిటే ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించారని కోఠిలో ఏర్పడిన సమావేశంలో స్వస్థ స్పోర్ట్స్ అకాడమీ
కోచ్ మత్తుర్తి జగదీశ్ తెలిపారు.