గీత శక్తి” పుస్తకం సమాజానికి మార్గదర్శనం

"Gita Shakti" book is a guide for societyనవతెలంగాణ – ముధోల్
గీత శక్తి పుస్తకం సమాజానికి మార్గదర్శనగా నిలుస్తుందని కవి,రచయిత, చిమ్ని ప్రక్రియ సృష్టికర్త జాదవ్ పుండలిక్ రావు అన్నారు. మండల కేంద్రంలోని రభింద్ర ఉన్నత పాఠశాలలో శనివారం కవి రెడ్ల బాలాజీ రాసిన గీత శక్తి పుస్తక ఆవిష్కరన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుస్తక రచయిత రెడ్ల బాలాజీ గీత శక్తి పుస్తకంలో ఒక వంద ఎనిమిది వచన కవితలు రాశారని, ప్రతి కవిత సమాజ హితానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి రచనలు మరెన్నో వెలువడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సాయినాథ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు మా పాఠశాల వేదిక కావడం చాలా గర్వకారణం ఉందని అన్నారు .విద్యార్థులకు ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. విద్యార్థులు అందరు సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలని, ఆత్మ విశ్వాసాన్ని నింపే గీతను ప్రతి ఒక్కరు చదవడం రోజు అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలు విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో కవులకు, కళాకారులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవులు కృష్ణమూర్తి, పీసర శ్రీనివాస్ గౌడ్ ,బసవరాజు,,ముఙ్గే రవి, తిరుమల రైస్ మిల్ ప్రతినిధి కౌటిల్ కృష్ణమూర్తి , గంగయ్య కళ్యాణ్ కార్ ,వినాయక్ అడ్వకేట్, వినయ్ కుమార్, ఎన్నారై బాజీరావు పాటిల్, రాకేష్ రెడ్డి ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ ఇన్ఫెక్ట్ మోటివేషన్ స్పీకర్ వాడేకర్ లక్ష్మణ్, శ్రీహరి, రభిం ద్రా ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్ డైరెక్టర్ పోతన్న యాదవ్ ,కవులు, కళాకారులు, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.