తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి

నవతెలంగాణ- వీణవంక 
తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఉయ్యాల చందర్(42) అనే గీత కార్మికుడు తన వృత్తిలో భాగంగా శుక్రవారం ఉదయం కల్లు తీయడానికి చెట్టు ఎక్కి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి కిందపడి అక్కడికి అక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న వీణవంక ఎస్సై ఆసిఫ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.