తాటిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి

Gita worker died after falling from ticketనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామానికి చెందిన రమణగోని లింగయ్య వయసు (62) గీత కార్మికుడు శనివారం ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి మృతి చెందారు. లింగయ్య మృతదేహాన్ని చౌటుప్పల్ ఆస్పత్రిలో సందర్శించి నివాళులు అర్పించారు. మృతి చెందిన గీత కార్మికునికి తక్షణమే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షుడు రాగీరి కృష్ణయ్య ఉపాధ్యక్షులు బత్తుల లక్ష్మయ్య గౌడ్, మండల అధ్యక్షులు మారగోని అశోక్ గౌడ్,పాల్గొని లింగయ్య మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.