
వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామానికి చెందిన పొన్నం పర్శయ్య(51)అనే గీత కార్మికుడు ఆదివారం ప్రమాదవశాత్తు తాటిచెట్టు నుంచి పడి మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కుల వృత్తి ఉపాధితోనే జీవిస్తున్నాడు. వేములవాడ ఏరియా ఆసుపత్రి వైద్యులు పొన్నం పర్షయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.