నవతెలంగాణ-తాడ్వాయి
కల్లుగీత కార్మికుల సమస్య పరిష్కారానికై డిసెంబర్ 3వ తేదీలో జిల్లా కేంద్రంలో జరుగు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సదస్సును జయప్రదం చేయాలని, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు నరసయ్య గౌడ్ అన్నారు. సోమవారం కాటాపూర్ లో కంఠమహేశ్వరుని ఆలయం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పులి నరసయ్య గౌడ్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో 9 మండలాల్లో కల్గీత కార్మికులు గీత వృత్తి చేసుకొని జీవిస్తున్నారని అన్నారు. మొత్తం 60 సొసైటీలు ఉండగా, అందులో 23 సొసైటీలు ప్రభుత్వ లైసెన్సులు కలిగి ఉన్నాయని చెప్పారు. మిగతా 37 సొసైటీలు ప్రభుత్వ లైసెన్సులు లేకుండా తాడి చెట్లు జీవనం గడుపుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వ సోసైటీ లేని గీతా కార్మికులు చెట్లపై నుండి పడి ప్రమాదాల బారిన పడ్డ గీత కార్మికుల బాధలు వర్ణాతీతంవని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన గీతా కార్మికుల హామీలను అమలుపరచాలన్నారు. ఏజెన్సీలో రద్దయి నా గీతా కార్మికులను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో గీతా కార్మికులకు ప్రత్యేక సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ సొసైటీ అధ్యక్షులు గడ్డం శ్రీధర్, గీత కార్మిక సంఘం సీనియర్ నాయకులు బెల్లంకొండ రోశయ్య గౌడ్, గడ్డం రాములు గౌడ్, పాలకుర్తి జగన్నాథం గౌడ్, సత్యం, పాలకుర్తి మధు, పులి రవి గౌడ్, బెల్లంకొండ రాజు, వడ్లకొండ రాజు, తడక నరహరి, తడక హరీష్, రంగు లాలయ, సదానందం గౌడ్, రంగు రాజు, గండు బిక్షపతి గౌడ్, పాలకుర్తి ఉపేందర్,తడక సుధాకర్, గడ్డం శంకరయ్య, వడ్లకొండ రాజు, బెల్లంకొండ నరేష్, గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు