అంజలి 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవివి సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హర్రర్ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 11న విడుదల చేశారు. సినిమాకు వస్తున్న స్పందన గురించి గీతాంజలి 3 గురించి దర్శకుడు శివ తుర్లపాటి మీడియాతో మాట్లాడారు. ‘మా సినిమాకి రెస్పాన్స్ చాలా బావుంది. రివ్యూలను కూడా చూశాను. రివ్యూల్లో చెప్పే విషయాలను నేనెప్పుడూ పాజిటివ్‌గా తీసుకుంటాను. సినిమాలో చాలా వాటికి ఆన్సర్ చేయకుండా వదిలేశారని కొందరు రాశారు. అయితే, ఆ లాజిక్కుల న్నింటికీ సమాధానం చెబుతూ పోతే, మూడు గంటల నిడివి వస్తుంది.వాటన్నింటికీ సమాధానంగా గీతాంజలి 3 తీయబోతున్నాం. ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ సినిమా. కాంజూరింగ్ టైప్ హర్రర్ ఇందులో చేయాలనే థాట్ మాకు లేదు. ఎంటర్‌టైనింగ్ సినిమాగానే చేశాం. కోన మార్క్ రైటింగ్‌ని ఆస్వాదించేవారికి చాలా బాగా నచ్చుతోంది. సునీల్, సత్య కామెడీ సెకండాఫ్‌లో పేలింది. క్లైమాక్స్‌ని కొందరు ఎక్స్‌ట్రార్డినరీ అని మెచ్చుకుంటున్నారు. అలాగే సడన్‌గా సినిమా అయిపోయిందని కూడా చెప్పారు’ అని అన్నారు.