గీతాంజలి ట్రైలర్ విడుద‌ల‌..

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: సౌత్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీతాంజలి. 2014లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించగా..శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రావ్ రమేష్, బ్రహ్మానందం కీ రోల్స్ లో కనిపించారు. అయితే దాదాపు 10 సంవత్సరాల తరువాత గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా తెరకెక్కుతోంది.ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ అందిస్తున్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే..నవ్విస్తూనే..గుండెల్లో భయం పెంచేతుంది.