నవతెలంగాణ- జిన్నారం
అభివద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అన్ని వర్గాల శ్రేయస్సు కోసం నిర్విరామంగా కషి చేస్తున్న కేసిఆర్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయం అందించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మై మహిపాల్ రెడ్డి కోరారు. జిన్నారం మండల కేంద్రంలో శనివారం ఒక కోటి 40 లక్షలతో చేపట్టిన అభివద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ఎమ్మెల్యే జిఎంఆర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత జిన్నారం వెంకటేశం గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి సర్పంచ్ అంతి రెడ్డి గారు లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్, నీలం సంజీవ బృందంతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా నూతన మత్స్యశాఖ భవనం ప్రారంభోత్సవం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన సబ్ సెంటర్ శంకుస్థాపన, విశ్వకర్మ సంఘం నూతన భవనం మహిళా సమైక్య భవనం, గ్రంథాలయ ప్రహరీ గోడ ప్రారంభోత్సవం నరిగూడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమాలలో ఎమ్మెల్యే బృందానికి నిర్వాహకులు ప్రజలు జేజేలు పలుకుతూ ఘనస్వాగతంతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా నిరుపేదల వివాహాల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దలిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, గహలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ రంగంలో విప్లవత్మక మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు.
ర్యాలీలో ఉత్సాహాం చూపిన యువత
జిన్నారంలో శనివారం చేపట్టిన అభివద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై అన్ని వర్గాలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ, ప్రత్యేక జీపు పైన ఊరేగింపు, గజమాలతో ఘనస్వాగతాలు జిన్నారం వెంకటేశం గౌడ్ బందం ఆధ్వర్యంలో సర్పంచ్ భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంత రెడ్డి గారు లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ నీలం సంజీవ, జిన్నారం పిహెచ్సి డాక్టర్ కోమల తారక్, మాజీ సర్పంచ్ జనార్దన్ గౌడ్, కోదండ రామాలయం చైర్మన్ భోజిరెడ్డి, నరసింహారెడ్డి, జిన్నారం గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, కార్యదర్శి లక్ష్మీకాంత్ రెడ్డి, మండల బీఆర్‌ఎస్ కమిటీ అధ్యక్షులు నాయకోటి రాజేష్ , టిఆర్‌ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు భీమ్రావు, పాలకవర్గ సభ్యులు ముదిరాజ్, ఎస్సీ, డ్వాక్రా, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.