పేద బిడ్డను, పల్లెటూరి బిడ్డను ఒక్క అవకాశం ఇవ్వండి..

– పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆది శ్రీనివాస్..
– వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ- వేములవాడ: పేద బిడ్డను, పల్లెటూరి బిడ్డను ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ తిప్పాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు.  తిప్పాపురం గ్రామంలో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద బిడ్డను పల్లెటూరి బిడ్డను ఒక్క అవకాశం ఇచ్చి చేతి గుర్తు మీద ఓటు వేయాలని ప్రజలను అందుబాటులో ఉండే వ్యక్తిని ఒక్క అవకాశం ఇచ్చి మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి అని ఆయన ప్రజలను కోరారు.  నేను లోకల్ బిడ్డను.. అధికార పార్టీ నుండి పోటీ చేసే వ్యక్తి నాన్ లోకల్ వ్యక్తి ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి అని ఒక్కసారి ఆలోచించండి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండి మీకు సేవ చేసిన వ్యక్తిని ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా  వేడుకుంటున్నామని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 25 వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని వారన్నారు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని వారన్నారు.  ప్రతి మహిళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చని గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఉచితంగా కరెంటు ఇస్తామని తెలిపారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. చేయూత పథక కింద నాలుగు వేల రూపాయల వృద్ధులకు నెలవారి పింఛన్ ఇస్తామని వారన్నారు. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తుక్కుగూడ సభలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ప్రకటించారని తెలిపారు. గెలిచిన వెంటనే సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని ఆయన అన్నారు. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు చేతి గుర్తు పైన ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర0 వెంకటస్వామి నాయకులు సంఘ స్వామి యాదవ్, చిలుక రమేష్, తుమ్ మధు, కనికరపు రాకేష్, అక్కన్న పెళ్లి నరేష్, నాగుల విష్ణు, ఇన్నారెడ్డి నాగుల రవీందర్, కదిర రాజకుమార్, నాగుల మహేష్, వస్తాది కృష్ణ, మామిడాల శ్రీకాంత్, ఇర్ఫాన్, గుర్రం తిరుపతి సాబీర్, బాలసాని తేజ, చిలువేరి శ్రీనివాస్, దేవేంద్ర, రేణుక,  ఖమ్మం గణేష్, బైరగోని చిరంజీవి, చాంద్, హతావ్, రజాక్, ఫెరోజ్, మూల కిషోర్, కూర దేవయ్య, నాగుల రాము,తంగేళ్ల గణేష్, కోయల్కర్ మస్తాన్, మండలజు సందీప్, చిన్న తదితరులు ఉన్నారు.