రహస్య కెమెరాల ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వండి

– సీఎస్‌, డీజీపీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏపీ కళాశాలలో గర్ల్స్‌ హాస్టల్‌ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)కి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కష్ణా జిల్లాలోని బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు ఉన్నట్టు నివేదించబడిన సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సుమోటగా పరిగణలోకి తీసుకుంది. మహిళల భద్రత, గౌరవ హక్కుపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ, సీఎస్‌, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.