రాజకీయాల్లో విద్యావేత్తలకు అవకాశం ఇవ్వండి

– పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డా.నరేందర్ రెడ్డి

నవతెలంగాణ కంఠేశ్వర్ 

రాజకీయాల్లో చదువుకున్న మేధావులు, విద్యావేత్తలకు అవకాశం కల్పిస్తే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు. విద్యావంతులు ఎన్నికల్లో గెలిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించగలరని అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. నిరుద్యోగులకు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ప్రకటన కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా ప్రైవేటు ఉద్యోగులకు అన్ని రకాల వసతులతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకై కృషి చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల జారీ సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. పట్టభద్రులందరు స్వచ్చందంగా ఓటు నమోదుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల వివిధ విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని. రానున్న పట్టబద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా, టిపిజెఎంఏ, టీపీడీఎంఏ రాష్ట్ర ప్రతినిధులు మేధావులు,విద్యావేత్తలు పాల్గొన్నారు. మీడియా సమావేశం అనంతరం జిల్లా కోర్టు లో న్యాయవాదులతో పలు డిగ్రీ కళాశాలలు జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ సంస్థలను సందర్శించి తనకు మద్దతు తెలిపాలని కోరారు.