
శాసనసభ ఎన్నికల ఎన్నికల ప్రచారం లో భాగంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, మండలంలోని రాంపూర్ గ్రామంలో మాక్లూర్ మండలంలోని కృష్ణానగర్, గంగరమంద, రాంపూర్, గద్ వాల క్యాంప్, రామస్వామి క్యాంప్, చిన్నాపూర్, అడవి మామిడిపల్లి, రామచంద్ర పల్లిలలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల ప్రజలు మంగళహారలతో, డప్పు చప్పుట్లతో , పూల వర్షంలతో తమ దైన శైలితో ఘన స్వాగతం పలికారు. రాంపూర్ గ్రామంలో గుర్రం స్వారీ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని… ఆర్మూర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల కోసం రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని, దరఖాస్తులకు ఎటువంటి రుసుము చెల్లించవద్దని అన్నారు. అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్ల కు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని తెలిపారు. 2014 నుండి 2023 వరకు 9½ సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్క ఇల్లు కూడా కట్టించలే నియోజకవర్గాన్ని భూముల పేరుతో దోచుకున్నాడని విమర్శించారు. పేదల భూములను కబ్జా చేస్తూ, ఎవరైనా ఎదిరిస్తే వారిపై కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం జరిగిందని అన్నారు. ఇటువంటి ఎమ్మెల్యేకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఓటర్లలతో అన్నారు. ప్రతి ఒక్క ఓటరు మీకు మంచి అవకాశం వచ్చింది మీ ఓటుతో బి ఆర్ఎస్, బిజెపి అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా చేయాలని అన్నారు. ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యేకు ఓడిపోతానని భయంతో ప్రతి గ్రామంలో రైస్ కుక్కర్, చీరలు, బంగారం పంపిణీ చేస్తున్ననని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు మోసపోవద్దని కబ్జాకోర్ ఎమ్మెల్యేను పంపించే సమయం వచ్చిందని ఆయన అన్నారు. నందిపేట్,నుండి మాక్లూర్, మండలంలో దాస్ నగర్ వరకు ఎన్నో ఊళ్లను కబ్జా చేశాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు క్యారెంటీలు అయిన మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 కి గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలు, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 15000 రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని, అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, అలాగే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు, చేయూత పథకం కింద 57 సంవత్సరాలు నిండిన, అర్హత ఉన్న వృద్ధులు అందరికీ నెలవారి పింఛన్ 4000 రూపాయలు ఇస్తామని, అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా వెళ్లొచ్చని అన్నారు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం రాగానే 60 రోజుల్లోనే అమలు చేస్తుందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డేగ పోశెట్టి,దయాకర్ రావు, రవి ప్రకాష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు,కార్యకర్తలు,,మహిళా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల ఎన్నికల ప్రచారం లో భాగంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, మండలంలోని రాంపూర్ గ్రామంలో మాక్లూర్ మండలంలోని కృష్ణానగర్,గంగరమంద,రాంపూర్,గద్ వాల క్యాంప్,రామస్వామి క్యాంప్,చిన్నాపూర్, అడవి మామిడిపల్లి, రామచంద్ర పల్లిలలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల ప్రజలు మంగళహారలతో, డప్పు చప్పుట్లతో , పూల వర్షంలతో తమ దైన శైలితో ఘన స్వాగతం పలికారు. రాంపూర్ గ్రామంలో గుర్రం స్వారీ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని… ఆర్మూర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల కోసం రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని, దరఖాస్తులకు ఎటువంటి రుసుము చెల్లించవద్దని అన్నారు. అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్ల కు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని తెలిపారు. 2014 నుండి 2023 వరకు 9½ సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్క ఇల్లు కూడా కట్టించలే నియోజకవర్గాన్ని భూముల పేరుతో దోచుకున్నాడని విమర్శించారు. పేదల భూములను కబ్జా చేస్తూ, ఎవరైనా ఎదిరిస్తే వారిపై కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం జరిగిందని అన్నారు. ఇటువంటి ఎమ్మెల్యేకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఓటర్లలతో అన్నారు. ప్రతి ఒక్క ఓటరు మీకు మంచి అవకాశం వచ్చింది మీ ఓటుతో బి ఆర్ఎస్, బిజెపి అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా చేయాలని అన్నారు. ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యేకు ఓడిపోతానని భయంతో ప్రతి గ్రామంలో రైస్ కుక్కర్, చీరలు, బంగారం పంపిణీ చేస్తున్ననని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు మోసపోవద్దని కబ్జాకోర్ ఎమ్మెల్యేను పంపించే సమయం వచ్చిందని ఆయన అన్నారు. నందిపేట్,నుండి మాక్లూర్, మండలంలో దాస్ నగర్ వరకు ఎన్నో ఊళ్లను కబ్జా చేశాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు క్యారెంటీలు అయిన మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 కి గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు.
గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలు, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 15000 రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని, అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, అలాగే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. చేయూత పథకం కింద 57 సంవత్సరాలు నిండిన, అర్హత ఉన్న వృద్ధులు అందరికీ నెలవారి పింఛన్ 4000 రూపాయలు ఇస్తామని, అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా వెళ్లొచ్చని అన్నారు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం రాగానే 60 రోజుల్లోనే అమలు చేస్తుందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డేగ పోశెట్టి,దయాకర్ రావు, రవి ప్రకాష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు,కార్యకర్తలు,,మహిళా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.