– చెప్పులు కుడుతూ వినూత్న రీతిలో ప్రచారం
– సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మట్టిపల్లి సైదులు
నవతెలంగాణ- కోదాడరూరల్
ప్రజా సమస్యలపై గుంతెత్తి పోరాడే నిరుపేద అభ్యర్థి నైనా తనకు ఓటేసి గెలిపించాలని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మట్టిపల్లి సైదులు అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో మెయిన్ రోడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చెప్పులు కుడుతూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేకమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు అని ఏ ఒక్కరూ నియోజకవర్గాన్ని అభివద్ధి చేయలేదని ఈసారి కచ్చితంగా సిపిఎం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని తెలిపారు. పెద్ద చెరువును ట్యాంక్ పండుగ ఏర్పాటు చేస్తానని ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. పట్టణ ప్రజల విశ్రాంతి తీసుకోవడానికి కూడా కనీసం పార్కులు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. నియోజకవర్గం అవినీతి మయంగా మారింది అని యువత డ్రగ్స్ కు బానిసై అనేకమంది చెడిపోతున్నారు అన్నారు. అసెంబ్లీలో కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు లేకపోవడం మూలంగా ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదన్నారు. ప్రశ్నించే గొంతులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కమ్యూనిస్టులు గెలిస్తే అసెంబ్లీలో కార్మికుల,కర్షకుల,బడుగు, బలహీన వర్గాల, దళిత గిరిజన మైనార్టీ ప్రజల సమస్యలపై గలంమెత్తుతారన్నారు. కాంగ్రెస్,బీఆర్‌ఎస్ పార్టీలుఓట్ల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు.ఎన్నికల్లో బూర్జవ, భూస్వామ్య పార్టీలను ఓడించాలని కోరారు. బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ కమ్యూనిస్టు మార్క్ లిస్ట్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి మట్టిపల్లి సైదులు యాదవుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోదాడ పట్టణ కార్యదర్శి మిట్ట గనుపుల ముత్యాలు , జిల్లా కమిటీ సభ్యులుదేవరం వెంకటరెడ్డి, బెల్లంకొండా సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నారసాని వెంకటేశ్వర్లు,ఆరె రామకష్ణారెడ్డి, ఐద్వా జిల్లా నాయకురాలు జూలకంటి విజయలక్ష్మి, పట్టణ నాయకులుదాసరి శ్రీనివాస్, కుక్కడపు నలిని, గిరిజ,మరియన్న,పాపా చారి,నవీన్, రహమాన్, వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.