
– దుబ్బాక ను బంగారు తునకలా చేసి చూపిస్తా
– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
నవతెలంగాణ దుబ్బాక రూరల్ : తొమ్మిదిన్నర యేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధినీ గాలికి వదిలేసింది. 2020 ఉపఎన్నికల్లో తాను గెలిచాకే నియోజకవర్గంలో రామలింగన్న వేసిన పునాది పనులను కొట్లాడి పూర్తి చేశాను. రానున్న ఎన్నికల్లో మరోసారి తనకు ఓటేసి గెలిపిస్తే దుబ్బాక ను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని పోతరెడ్డి పేట, చిన్న నిజాంపేట, రామేశ్వరం పల్లి, కూడవెళ్లి గ్రామాల్లో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావ్ కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరోసారి నాకు అవకాశం ఇవ్వండి దుబ్బాక ను బంగారు తునక లాగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మరోసారి ఓటేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు అరిగే కృష్ణ, తాళ్ళపల్లి సర్పంచ్ ప్రియాంక యాదగిరి, శక్తి కేంద్ర ఇంచార్జీ పాతురీ స్వామిరెడ్డి, మధు గని గణేష్, ఉల్లెంగుల నరేష్, స్వామి యాదగిరి , బూత్ ప్రెసిడెంట్ శివ రాజు, బీజేవైఎం మండల ప్రెసిడెంట్ మహేష్, సీనియర్ నాయకులు సంగం పరశురాములు తదితరులు ఉన్నారు