ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

– కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ- ఆర్మూర్ : 
ఒకసారి అవకాశం ఇవ్వండి నియోజకవర్గ అభివృద్ధికి నిర్విరామ కృషి చేస్తాను అని కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణంలో నీ రాజారాం నగర్ కాలనీలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల లో ఏమి జరిగిందో అందరికీ తెలుసని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల లోనే హామీలన్నీ అమలు చేస్తామని, కాంగ్రెస్ ప్రజల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీ స్కీములు పెట్టిందని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు