భూమికి బదులు భూమి ఇవ్వండి..

Give land instead of land..నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
త్రిబుల్ ఆర్ బాధితులు చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి తహసిల్దార్ హరికృష్ణ సమక్షంలో గురువారం తహశీల్దార్ కార్యాయంలో భూసేకరణ కార్యక్రమం నిర్వహించారు. నేలపట్ల,తంగడపల్లి  గ్రామస్తులు త్రిబుల్ ఆర్ కొరకు భూసేకరణ పత్రాలను రెవిన్యూ అధికారులకు ఇవ్వకుండా బహిష్కరించారు.రైతులు భూములు ఇవ్వడానికి మొగ్గు చూపకపోవడం, మార్కెట్ ధర కంటే తక్కువ రేటు  ఇస్తుండడంతో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.దివిస్ ఫార్మా కంపెనీ వలన మా భూములు లాక్కుంటున్నారనీ,కనుక బహిరంగ మార్కెట్ రేటు ఇచ్చినట్లయితే భూమికి భూమి ఇచ్చినట్లయితే మేము త్రిబుల్ ఆర్ కు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, త్రిబుల్ ఆర్ భూముల సేకరణ పారదర్శకంగా లేదనీ ఆర్ డి ఓ ఎదుట వాపోయారు.బడా బాబుల ఫార్మా కంపెనీల కొరకు అలైన్మెంట్ అనుకూలంగా మారుస్తూ, రైతుల భూములపై త్రిబుల్ ఆర్ ను మల్లిస్తున్నారని అన్నారు.కనుక దీని వెంటనే అలైన్మెంట్ రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండేటట్లుగా ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని త్రిబుల్ ఆర్ బాధితులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దబ్బటి రాములు గౌడ్ చింతల దామోదర్ రెడ్డి బోరం ప్రకాష్ సందగళ్ళ మల్లేస్ గౌడ్ గుజ్జుల సురేందర్ రెడ్డి చింతల సుధాకర్ రెడ్డి చింతల ప్రభాకర్ రెడ్డి జాల శ్రీశైలం పబ్బు శివ గౌడ్ ఎసి రెడ్డి దామోదర్ రెడ్డి వెంకటేశం నరసింహ మల్లయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.