మునుగోడు ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇవ్వండి

 – స్వతంత్ర  మునుగోడు అభ్యర్థి  మర్రి రామస్వామి 
నవతెలంగాణ- చండూరు: మునుగుడు ఎమ్మెల్యేగా  ఒకసారి అవకాశం ఇవ్వాలని స్వతంత్ర అభ్యర్థి మర్రి రామస్వామి మునుగోడు ప్రజలను కోరారు.  గురువారం స్థానిక ఆరో కార్యాలయంలో  తన నామినేషన్  ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మునుగోడు ఆర్.ఓ  దామోదర్ రావు కు  అందజేశారు. అనంతరం విలేకరులతో మా ఆయన మాట్లాడుతూ   మునుగోడు ప్రజలు  ఒకసారి ఆలోచించి జీవించి అసెంబ్లీకి పంపాలని కోరారు.  మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో పోట్లాడుతానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో  రాపోలు రవి, మద్ది శీను తదితరులు ఉన్నారు.