మా నాన్న పోచారంకు మరో అవకాశం ఇవ్వండి 

 – ఒక్క ఓటుతో ఐదు ఎండ్లు సేవలు చేస్తాం..
 – డిసిసిబి చైర్మన్: పోచారం భాస్కర్ రెడ్డి
నవ తెలంగాణ- నసురుల్లాబాద్: మా నాన్న పోచారం 650 కోట్లతో బాన్సువాడ అభివృద్ధి చేశారని, బాన్సువాడ నియోజకవర్గానికి బంగారు బాన్సువాడగా తీర్చిదిద్దిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని వివిధ కాలనీలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఇంటింటికి వెళ్లుతు బీఆర్ఎస్ మేనిఫెస్టోను పత్రాలను పంపిణీ చేస్తూ మా నాన్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మీరు ఒక్క ఓటు వేస్తే మీకు ఐదు ఇండ్లు సేవలందిస్తామన్నారు. మా నాన్నకు బాన్సువాడ నియోజకవర్గ ప్రజలే కుటుంబ సభ్యుల్ని మాకన్నా ఎక్కువ సమయం నియోజకవర్గ ప్రజల కోసమే ఇస్తారని అన్నారు. 650 కోట్లతో బాన్సువాడ ను అభివృద్ధి ఇందులో రూ.40 కోట్లతో బాన్సువాడ ప్రధాన రహదారి, సెంట్రల్ లైటింగ్, రూ.100 కోట్లతో పట్టణంలో సి.సి. రోడ్లు, డ్రైనేజీలు, రూ. 15 కోట్లతో మంజీర నదిపై చింతల నాగారం వద్ద చెక్ డ్యామ్ నిర్మాణం. రూ. 2.50 కోట్లతో తాడ్కోల్ రోడ్డు విస్తరణ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు సరఫరా, రూ.7 కోట్లతో కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరణ. రూ.4 కోట్లతో చిల్డ్రన్స్ పార్క్ మరియు మల్టీ జనరేషన్ పార్కుల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మీ కళ్ళ ముందు చేసిన అభివృద్ధి కనిపిస్తుందని మీరందరూ మరోసారి మా నాన్న పోచారం ఓటు వేసి ఆశీర్వదించాలని మీ ఒక్క ఓటుతో మా నాన్న మేము ఐదు సంవత్సరాలు మీకు సేవలు అందిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో బాన్సువాడ ఆదర్శ నియోజకవర్గంగా మార్చిన ఘనత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 11వేల డబుల్ బెడ్ రూములు నిర్మించి రాష్ట్రంలోనే బాన్సువాడ ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే 14 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి చేశారన్నారు. ప్రజలు అడిగిన ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశామన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో
 జిల్లా రైతుబందు జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు ఏర్వల కృష్ణారెడ్డి కౌన్సిలర్లు లింగమేశ్వర్, రవీందర్ రెడ్డి ఇతర కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.