పనిచేసే వారికి ఓటు ప్రాధాన్యత కల్పించండి

బడే నాగజ్యోతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
నవతెలంగాణ-గోవిందరావుపేట
పనిచేసేవారిని గుర్తించి ఓటు ప్రాధాన్యత కల్పించి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో 100 ఓట్ల ఇన్చార్జీల ముఖ్య నాయకుల సమావేశం మండల అధ్యక్షులు  సూరపునేని సాయికుమార్ ఆధ్వర్యంలో కమ్మ కమ్యూనిటి భవన్ నందు జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలోని ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్లి గత పది ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచార నిర్వహించాలన్నారు. అభ్యర్థిగా ఉండి అభివృద్ధి చేయలేని వారి వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు. అధికారంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ద్వారా అభివృద్ధి సాధ్యమని వివరించాలని అన్నారు. తెలంగాణలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది. అన్ని వర్గాల  జీవితాల్లో వెలుగులు నింపేలా ఉందన్నారు. తెల్లరేషన్ కార్డున్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు బీమా ఇవ్వడం.. ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామనడం, ప్రతి పేదింటి మహిళకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పేదల పట్ల మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రస్తుతం ఉన్న ఆసరాను రూ.5వేలకు, దివ్యాంగులకు రూ.6వేలకు పెంచడం అభాగ్యులకు ఆర్థిక భరోసానివ్వడమే అని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంటపెట్టుబడి సాయాన్ని రూ.16వేలకు పెంచడం కూడా మరోకసారి రైతాంగం పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న శ్రద్ధకు ఉదాహరణ అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రైతులను, మహిళలను, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం కేసీఆర్  కార్యదక్షతను తెలియజేస్తుంది. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు. గతంలో నెర్రెలుబారిన నేలలు, బీడు భూములు కనిపించేవి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్  దృఢ సంకల్పంతో తెలంగాణ భూములు ఈరోజు పచ్చబడ్డాయి. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు దర్శనం ఇస్తున్నాయి. అని  అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మూడు మండలాల ఎన్నికల ఇన్చార్జి సాంబారి సమ్మరావు ఎంపీటీసీలు ఆలూరి శ్రీనివాసరావు, చల్వాయి సర్పంచ్ ఈసం సమ్మయ్య తలసిల ప్రసాద్  పిన్నింటి మధుసూదన్ రెడ్డి గోవిందరావుపేట రైతుబంధు కోఆర్డినేటర్ ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్ ములుగు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నెమలి బాలకృష్ణ పృథ్వీరాజ్ ఉట్ల అధికార ప్రతినిధి భూ రెడ్డి మధు బి సురేందర్ గౌడ్ ఎల్ రామచందర్ పిఎసిఎస్ డైరెక్టర్ సూది రెడ్డి లక్ష్మారెడ్డి మండల కో ఆప్షన్ సభ్యుడు ఎం.డి బాబార్ రైతు కోఆర్డినేటర్ ఇంచార్జ్ భూక్య దేవా నాయక్ మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ ఎల్ చందులాల్ మహిళా అధ్యక్షురాలు బత్తుల రాణి సీనియర్ నాయకురాలు భూక్య సుమలత ఉట్ల మోహన్ డి సంజీవ మండల అధ్యక్షులు అక్కినపల్లి రమేష్ తాటికొండ శ్రీనివాస చారి నామ్ పూర్ణచందర్ కేదారి బండపల్లి రాజశేఖర, కోలసాని శ్రీనివాస్ జే రామారావు కే ఇంద్రారెడ్డి గట్టు ధర్మయ్య కే సారయ్య ఎన్ స్వామి వి నాగ చారి ఏ సమ్మయ్య ఎన్ శాంతి ఎన్ నరేందర్ ఎం కరుణాకర్ బి నరేష్ జి ఎలంధర్ ఎం వెంకన్న కే రవి వెంకటరామయ్య వెంకటేశ్వర్లు సమ్మయ్య ఏ శ్రీనివాసరావు ఏ వెంకటరమణయ్య ఏ రమేష్ ఊటుకూరు వెంకటరమణయ్య కే తిరుపతి సారయ్య వెంకటేశ్వరరావు రవి పి సమ్మయ్య జి ఉపేందర్ ఎస్ సతీష్ పి నగేష్ ఓ సతీష్ ఎస్ ఇంద్రారెడ్డి వెంకట్రెడ్డి కే విజయ్ జి రాకేష్ చంద్రమోహన్ ఎస్ రామిరెడ్డి కృష్ణారెడ్డి అశోక్ రెడ్డి పి వెంకటేష్, బి వెంకటేష్ సిహెచ్ సురేష్ పి రాజు కే సమ్మయ్య బైక్ కాని ఓదెలు పూర్ణచందర్ కళింగ రెడ్డి ఎం రవి కె వెంకన్న జి శ్యామ్ మేష కే సందీప్ ఏ సతీష్ ఆ సమ్మయ్య సతీష్ రమేష్ యాదయ్య శ్యామ్ కుమార్ కే వినయ్ జి స్వామి రఘువీర్ శ్రీధర్ కిరణ్ పవన్ సావధాన్ రాజు రమేష్ రమేష్ కనకయ్య విజయ్ కుమార్ నాగరాజు శ్రీనివాస్, అధ్యక్షులు సోషల్ మీడియా వారియర్స్ బీఆర్ఎస్ సర్పంచ్లు గోవిందరావుపేట మండల పరిధిలోని వివిధ సంఘం అధ్యక్షులు గోవిందరావుపేట మండల పరిధిలోని రైతు సమన్యాయ కోఆర్డినేటర్లు పి ఎస్ సి ఎస్ డైరెక్టర్లు ఉద్యమకారులు సీనియర్ నాయకులు మహిళా అధ్యక్షులు నాయకులు ముఖ్య నాయకులు సోషల్ మీడియా వారియర్స్ యూత్ సభ్యులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.