జాతరలో పోగొట్టుకున్న మంగళసూత్రం అందజేత

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో శనివారం బ్రహ్మంగారి జాతర ఉత్సవాలలో దర్శనం కోసం వచ్చిన ఒక భక్తురాలు తన మంగళసూత్రం శ్రీ గురు క్షేత్రంపై గుట్టపైన పోగొట్టుకుంది. అట్టి  మంగళసూత్రం జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన  కమ్మర్ పల్లికి  చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు  శ్రీ కుమార్ కు దొరికింది. దానిని తీసుకొచ్చి ఆయన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అంగిరేకుల మల్లేష్ కు  అప్పగించాడు. ఈ విషయాన్ని మైక్ లో అనౌన్స్ మెంట్ చేయడంతో మంగళసూత్రం పోగొట్టుకున్న మహిళ గుడి వద్దకు రావడంతో  గ్రామ సంఘం సభ్యుల సమీక్షంలో పోగొట్టుకున్న మహిళకు మంగళసూత్రం అప్పగించారు. దొరికిన మంగళసూత్రాన్ని అప్పగించిన శ్రీ కుమార్ ను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించగా,  బాధితురాలు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షులు అంగిరేకుల  మల్లేష్, ఉపాధ్యక్షులు దండుగుల సాయిరాం, క్యాషియర్ చిలివేరి భూమేశ్వర్, గ్రామ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.