విద్యార్థులకు ప్రోత్సాహకం అందజేయడం అభినందనీయం

నవతెలంగాణ- ఆర్మూర్  

సేవ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు అందజేయడం అభినందనీయమని మండలంలోని పి ఫ్రీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ అన్నారు .గురువారం బ్రహ్మంగారి గుడి ఆలయ కమిటీ అధ్యక్షులు సుంకం భూషణ్ గత ఏడు సంవత్సరాల నుండి విద్యార్థిని విద్యార్థులు చదువులో ముందుండాలని సహాయ సహకారాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పాఠశాల ప్రాధన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ ,,రఘు ,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.