బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 26 మంది విద్యార్థులకు బూట్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చదివి ఉన్నత స్థానాలకు ఎదగి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ. మంచి మనసుతో ముందుకొచ్చి విద్యార్థులకు షూస్, సాక్స్ లు పంపిణీ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశ్రితదేవి, టీచరు రాము,గ్రామ అభివృద్ధి కమిటీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.