విశ్వంభర కీలక షెడ్యూల్‌ పూర్తి

విశ్వంభర కీలక షెడ్యూల్‌ పూర్తిచిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ గ్లింప్స్‌ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కష్ణన్‌ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్‌, పాట, యాక్షన్‌ బ్లాక్‌ని చిత్రీకరించారు. చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం బందంతో పాటు త్రిష కష్ణన్‌ దిగిన కొన్ని ఫోటోలని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను యువి క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.