
మండల పద్మశాలి సంఘం అధ్వర్యంలో సోమవారం భక్త మార్కండేయ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు భక్త మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేశారు. మండలాధ్యక్షుడు మచ్చ శేఖర్, పట్టణ అధ్యక్షుడు బూట్ల సూర్యప్రకాష్, మాజీ సర్పంచ్ ద్యావనపల్లి మంజుల దంపతులు, వడ్డేపల్లి మల్లేశం, కొండా మల్లేశం, బూట్ల శ్రీపతి తదితరులు పాల్గొన్నారు