మద్నూర్ మండల కేంద్రంలోని గంగ్ శెట్టి హనుమాన్ మందిరం వద్ద గల సాయిబాబా మందిరంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం కాకడ హరతీ అనంతరం బాబావారికి పంచామృత మంగళస్నానం చేపట్టారు. అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. మహారాష్ట్రకు చెందిన భక్తులు సైతం పాల్గొన్నారు. సాయంత్రం పల్లకి సేవా, రాత్రి భజన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.