
మండలంలోని మాందాపురంలో ప్రవాస భారతీయులు సోలిపురం ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సోలిపురం వెంకట్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి ల సౌజన్యంతో నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయంలో 16 వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వేదపండితులు ప్రబందపారాయణం, ద్వారతోరణ పూజలు, చతుస్నాణార్చన, హోమం, నివేదన, తీర్థ ప్రసాద వినియోగం మొదలగు పూజలు నిర్వహించి అనంతరం స్వామీ వారి అమ్మ వార్ల కళ్యాణం వేద మంత్రోచ్చారణల మధ్య భక్తుల కనుల పండుగగా అంగ రంగ వైభవంగా తిరు కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని అమ్మవార్లను ఆసీనులను చేసి గ్రామంలోని వీదులలో రథోస్త్సవం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి, సోలిపురం రాం రెడ్డి, అమరేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, శ్రీ కాంత్ రెడ్డి, చంద్రకళ, చెన్నారెడ్డి, రాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.