
వెట్రన్ ఇండియా స్పోర్ట్స్ వింగ్ తెలంగాణ చాప్టర్ వాళ్లు హైదరాబాద్ లో నిర్వహించినటువంటి నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ లోపల మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలోనీ జ్ఞానోదయ పాఠశాల విద్యార్థి కేతావత్ రాణా ప్రతాప్ బంగారు పథకం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ నరహరి నాయక్ మాట్లాడుతూ కేతావత్ రాణా ప్రతాప్ 30 సెకన్ లోపల నాకౌట్ చేసి అద్భుతమైనటువంటి ప్రదర్శనతో విజృంభించడం సంతోషాన్ని కలిగించిందని ఆయన వివరించారు. అలాగే పాఠశాల కరస్పాండెంట్ దేవ శంకర్ మాట్లాడుతూ ఇకముందు కూడా మా పాఠశాల విద్యార్థులకు మాస్టర్ నరహరి నాయక్ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను వెలికితీస్తామని, వారు చదువుతున్న పాఠశాలకు అలాగే వారి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా చూస్తామని ఆయన తెలిపారు.