యూనివర్శిటీ భూములను ఇతర శాఖలకు కేటాయించే జి.ఒ రద్దు చేయాలి

– వ్యవసాయ విద్యార్ధులు
నవతెలంగాణ – అశ్వారావుపేట :
యూనివర్శిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ జీవో జారీ చేయడం పట్ల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
శుక్రవారం స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్ధులు కళ్లకు నల్ల బ్యాడ్జీ లు ధరించి కళాశాల ప్రధాన గేటు వద్ద గంటపాటు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్శిటీ భూముల కేటాయింపు జీవోను తక్షణమే రద్దు చేయాలని,లేని పక్షంలో మరిన్ని పోరాటాలకు సిద్దమని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.