విభజన హామీలు నెరవేర్చని ‘మోడీ గో బ్యాక్‌’

నవతెలంగాణ-చేవెళ్ల
వరంగల్‌కు మోడీ వస్తున్న సందర్భంగా విభజన హామీలు నెరవేర్చాలని, ‘మోడీ గో బ్యాక్‌’ అంటూ సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో హైదరాబాద్‌ బీజాపూర్‌ రోడ్డుపైన మోడీ దిష్టి బొమ్మను దహనం చేసి, ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్య క్రమంలో పాల్గొన్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామ స్వామి హాజరై, మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమా లను ఆపలేరని, అరచేతితో సూర్యుడిని ఆపలేరని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు నెరవేర్చని నరేం ద్ర మోడీ తెలంగాణకు రావడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతీ భారతీయ పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఏ ఒక్క హామీ నెరవేర్చని మోడీ తెలంగాణకు ఎందుకు వస్తున్నారని నిలదీశారు. మోడీ గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నిరసన చేపడితే అరెస్టు చేయడం ఎమిటని ప్రశ్నించారు. భారత రాజ్యా ంగంలో ఆర్టికల్‌ 19 ప్రకారమే ప్రజాస్వామ్యంగా నిరసన చేసే హక్కు భారత దేశంలో ఉండే ప్రతి పౌరుడికీ ఉంటుం దన్నారు. అరెస్టు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును, నాయకులను వెంటనే విడుదల చేయా లని, లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. ప్రభు లింగం, పార్టీ మండల కార్య దర్శి ఎం. సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శి ఎండీ. మక్బుల్‌, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ షౌరీలు, గండిపేట్‌ మండల కార్యదర్శి బాబురావు, మండల కార్యదర్శి మల్లేష్‌, బీవోసీ మండల కార్యదర్శి శ్రీను, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వడ్ల మంజుల, తదితరులు పాల్గొన్నారు.