– నిజామాబాద్ ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అశోక్
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగర ప్రజలందరికీ పోలీసు వారి హెచ్చరిక రాబోయే 48 గంటల లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు కావున కాలువలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లే ప్రమాదం ఉంది కావున అత్యంత అవసరాల మీరకే బయటకు వెళ్లాలని ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అశోక్ ఆదివారం సూచించారు.ప్రజలు ఏదయినా ప్రయాణాలు (టూర్లు) ముందే అనుకొని ఉంటే అట్టి ప్రయాణాలు 48 గంటలు వాయిదా వేసుకోవాలని తెలియజేశారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు రావొద్దు అని తెలియజేశారు. రోడ్ల పై నుండి వరద నీరు వెళ్లే ప్రమాదం ఉంది అలా వరద నీరు ప్రవహిస్తున్నపుడు ప్రజలు ఏమవుతుంది లే అని అట్టి రోడ్లు దాటితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కావున ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి రోడ్లు దాట రాదు అని తెలియజేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి, ప్రజలు వర్షం వల్ల ఏదయినా సమస్య వస్తే వెంటనే 100 నంబర్ కి కాని, 8712659844 (ఎస్ హెచ్ ఓ టౌన్-V) నెంబర్ కి ఫోన్ చేయగలరని తెలిపారు. చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండకూడదని, కరెంటు స్తంభాలు ముట్టుకోరాదని పలు సూచనలను నిజామాబాద్ ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అశోక్ సూచించారు.