న్యూఢిల్లీ: ప్రపంచంలోని తొలిసారి 100 శాతం పర్యావరణ అనుకూల, సర్య్కూలర్ పాదరక్షల బ్రాండ్‌గా ‘గో ప్లానెట్-డి బై డెబోంగో’ అవతరించిందని ఆ సంస్థ పేర్కొంది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి, పాదరక్షల పరిశ్రమలో పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించడానికి ఈ వ్యాపార నమూనాను స్వీకరిస్తున్నట్లు వికెసి ఎండి వికెసి రజాక్ పేర్కొన్నారు. ఇక తమ సంస్థ రీసెల్. రీసైకిల్. రెన్యూ అనే కొత్త వ్యాపార మంత్రాన్ని అనుసరిస్తుందన్నారు.