– ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి డి ఒడ్డెన్న

లక్ష్య సాధనే ధ్యేయంగా ప్రతి విద్యార్థి చదువు కోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి డి ఒడ్డెన్న సూచించారు. నాంపల్లి లోని ఎంఏఎం ఉర్దూ మీడియం, ప్రభుత్వ మాడల్ మహిళా జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడి కళాశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన విద్యాసంవత్సరంలో కళాశాలలో చేరిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. లక్ష్య సాధన ధ్యేయంగా ప్రతి విద్యార్ధి గురి ఉండాలన్నారు. ఆ దిశగా క్రమం తప్పకుండా తరగతులను హాజరుకావాలని అన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మరింత ఉత్తమ ఫలితాలు సాధించాలని, ఆ దిశగా అధ్యాప కులు కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రుల ఆకాంక్ష విద్యార్థుల ధ్యేయాన్ని అందుకునే విధంగా పట్టుదలతో చదువుకోవాలన్నారు. అధ్యాపకులకు మంచి ఫలితాలు సాధించాలి అని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో మరమ్మ త్తులు చేసిన మరుగుదొడ్లను పరిశీలించారు. అధ్యాపకుల టీచింగ్ డైరీ, హాజరు పట్టికలను తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యా ర్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ యు.అనిత, అధ్యాపకులు పాల్గొన్నారు.