
నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండల కేంద్రంలో విద్యు దాఘాతంతో రూ.10 వేల విలువైన మేక మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన చెట్కూరి రవి మేక మృతి చెందినట్లు వారు తెలిపారు. గ్రామ శివార్లో నిర్లక్ష్యంగా ఎలాంటి భద్రత లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఉండడంతోనే మేక మృతి చెందిందని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు కంచే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో సైతం ఓ మేక మృతి చెందినట్లు వారు తెలిపారు.