నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో లో మేక ను మరుపల్లి ఎల్లయ్య పశువుల కొట్టం వద్ద దొంగతనం చేసి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో మేకను దొంగిలించి విక్రయిస్తుండగా, కొనుగోలు చేసే వ్యక్తి కి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగింది. మేకను దొంగిలించిన దుండగులు తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వేణు, అనిల్ గా గుర్తించాము. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వేణు, అనిల్ లు బుధవారం రాత్రి సమయంలో బైక్ పైన వచ్చి కృష్ణాజివాడి గ్రామంలో మేకను దొంగిలించారు.అనంతరం మేకను బైక్ పై తీసుకువచ్చి పాత బస్టాండ్ లో తక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కొనుగోలు చేసే వ్యక్తి కి అనుమానం వచ్చి మేకను తీసుకువచ్చిన వేణు, అనిల్ ను ఆరా తీశాడు. దీంతో మేకను కృష్ణాజీవాడలో దొంగిలించినట్లు వేణు, అనిల్ ఒప్పుకోవడంతో స్థానికులు చితకబాదారు. అనంతరం మేక దొంగలను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.