ఆడపడుచుల ఆకాంక్షలను భగవంతుడు నెరవేర్చాలి 

– గిరిజన మహిళలతో నృత్యం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ 
తీజ్ ఉత్సవాలలో భాగంగా కుటుంబం బాగుండాలని, మంచి భర్త రావాలని ఏ ఆకాంక్షతో ఆడపడుచులు నవధాన్యాలతో నారు పోసి తొమ్మిది రోజులు ప్రత్యేక దీక్ష చేస్తున్నారో వారి ఆకాంక్షను ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం  హుస్నాబాద్ పట్టణంలో గిరిజనులు నిర్వహించిన తీజ్ ఉత్సవాలలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. తీజ్ ఉత్సవాలలో బంజారా మహిళలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన తండాల్లో సౌకర్యాలు లేక విద్యకు దూరంగా ఉన్న వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.1978లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తెచ్చిన రిజర్వేషన్లతోనే గిరిజనులు అనేక ఉద్యోగ, ఉపాది అవకాశాలు పొందారన్నారు. సమృద్ధిగా వర్షాలు కరువాలని పాడి పంటలతో రైతులు సుభిక్షంగాఉండాలన్నారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది గిరిజనులు ఒకే భాష మాట్లాడుతున్నారని, తండలపై సి బి బి.ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. విద్యకు దూరంగా ఉండి గిరిజన తండాల్లో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి విద్యను అందిస్తామని పేర్కొన్నారు. ఇంకా వెనుకబడిన తండాలు, సౌకర్యాలు లేక చదువుకు దూరంగా గిరిజనులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుక రావాలని కోరారు.