పెంజర్ల లో నేడు గోదాదేవి కళ్యాణం

– ఆలయ కమిటీ చైర్మన్ బెజవాడ అనితారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం.
– కల్యాణోత్సవం లో పాల్గొననున్న ఎమ్యెల్యే వీర్ల పల్లి శంకర్ దంపతులు
నవతెలంగాణ-కొత్తూరు : పెంజర్లలో నేడు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ బెజవాడ అనిత రెడ్డి తెలిపారు.  కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం శోభాకృత నామ సంవత్సరం మార్గశిర శుక్ల చవితి రోజున కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి ఆమె విజ్ఞప్తి చేశారు.