నవతెలంగాణ – మిరు దొడ్డి
అన్ని దానాల కన్నా గోదానం మిన్న అనే నానుడిని వినే ఉంటాం. హిందువుల ఆశ్రమానికి ముస్లింలు గోవును దానం చేయడం చాలా అరుదు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో చోటుచేసుకుంది. హిందూ, ముస్లిం భాయి భాయి అనే నానుడిని నిజం చేస్తూ హిందువుల మనోభావాలను గౌరవించే విధంగా మహమ్మద్ బాబా అనే మిరుదొడ్డికి చెందిన ముస్లిం మాధవానంద ఆశ్రమానికి గోవును అందించి ఆదర్శంగా నిలిచారు. కుల, మతాలకు అతీతంగా తాను గోదానం చేయడం పట్ల హిందువులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ కుమార్, శ్రీనివాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.