నవతెలంగాణ-ఏటూరు నాగారం (ఐటీడీఏ)
మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరద ప్రమాద స్థాయిని చేరింది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి తగ్గుతూ పెరుగుతూ ప్రవహిస్తుంది. శనివారం ఉదయం 9గంటలకు 16.60 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహించింది. సాయంత్రం ఐదు గంటలకు 15.72 మీటర్లకు చేరి తగ్గుముఖం పట్టింది. అయితే గోదావరి ఏ క్షణంలోనైనా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద పోలీసులు పహారా కాస్తూ పోలీసు ఉన్నతాది óకారులకు గంట గంటకు సమాచారాన్ని చేర వేస్తున్నారు. గోదావరిలో ఎవరు దిగకుండా అప్ర మత్తం చేశారు.
లీకేజీలతో ముంపు
మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న కరకట్ట వెంట ఉన్న షట్టర్ల ద్వారా గోదావరి నీరు లీకేజీ అవుతూ గ్రామాల్లోకి వస్తుంది. రామన్నగూడెం శివాలయం, గొంటొర్రె వద్ద గోదావరి కమ్ము వచ్చింది. దీంతో పంట పొలాల్లోకి చేరడంతో బోరు మోటార్లు నీట మునిగాయి. అయితే వెంటనే ఇరిగేషన్ అధికారులు 19బ్లాక్‌లలో ఉన్న 42షెట్టర్లను తక్షణమే మూసివేశారు. దీంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. అంతేకాకుండా రామన్నగూడెం, రాంనగర్ గ్రామాల మధ్యలోని జీడివాగు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో రాంనగర్, కోయగూడఎల్లాపురం గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. అలాగే రొయ్యూర్, శంకరాజుపల్లి, ముళ్లకట్ట, రాంపూర్ గోదావరి వరద నీరు ఒడ్డును కోయడంతో పొలాలు నీటిలో కలిసి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న వాగులు
మండలంలోని కొండాయి, ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగు ఉధతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలను నిలిపివేశారు. కేవలం అత్యవసరం అయితేగానీ పడవల ద్వారా దాటి స్తున్నారు. ఏటూరునాగారం-మంగపేట మధ్యలోని జీడివాగుకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఉధతిగా ప్రవహిస్తోంది.