
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును గోదావరి నది మేనేజ్మెంట్ డాక్టర్ ముఖేష్ కుమార్ సింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డి ఈ ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గోదావరి నది మేనేజ్మెంట్ ముఖేష్ కుమార్ సింహ ఆదివారం రోజు ప్రాజెక్టును పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న నదులు ప్రాజెక్టులను గోదావరి నది మేనేజ్మెంట్ అప్పుడప్పుడు పరిశీలిస్తుందని అందులో భాగంగానే ఆదివారం ప్రాజెక్టును పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.