– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్
– బేతుపల్లి, తాళ్లమడ ఏరువాకలో ఎమ్మెల్యే దంపతులు
నవతెలంగాణ-సత్తుపల్లి
అన్నదాతలు సంతోషంగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని, రైతు ఆనందంగా ఉన్ననాడే దేశమంతా సంతోషం వెల్లివిరుస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మండలం బేతుపల్లి, తాళ్లమడ గ్రామాల్లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అరకపట్టి దుక్కిదున్నారు, పొలంలో ట్రాక్టరును నడిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో త్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ప్రాంతానికి పారించి సత్తుపల్లి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతుందన్నారు. చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అవసరమున్న చోట చెక్‌డ్యాంల నిర్మాణం చేపడతున్నామన్నారు. కార్యక్రమంలో ఏడీ నరసింహారావు, ఏవో శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, ఉడతనేని అప్పారావు, దొడ్డా శ్రీనివాసరావు, ఇమ్మనేని ప్రసాద్, మందపాటి ముత్తారెడ్డి, గాదె చెన్నకేశవరావు, పాకలపాటి శ్రీనివాసరావు, పింగిలి సామేలు, దోమ ఆనంద్, మట్టా చెన్నారావు, వినుకొండ కృష్ణ, దొడ్డా గోపాలరావు, మందపాటి రవీంద్రరెడ్డి, కొప్పుల నరేంద్రరెడ్డి, కౌన్సిలర్ మందపాటి పద్మజ్యోతి పాల్గొన్నారు.