శ్రీలక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. శ్రీ డింగరి సునీల్చార్యులు అజిత్ చార్యులు సమక్షంలో అమ్మవారికి విశేష కుంకుమార్చన అభిషేకం హోమది పూజలు మరియు కడారి గీతా దేవి మహేందర్ రెడ్డి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుచున్నామనీ అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదించారు.