న్యూఢిల్లీ : దక్షిణాదిలో డెయిరీ ఫామ్ రుణాల విభాగంలోకి ప్రవేశించినట్లు గోద్రెజ్ కాపిటల్ తెలిపింది. క్రీమ్‌లైన్ డైరీ ప్రొడక్ట్స్, ఈ డైరీ భాగస్వామం ద్వారా పాడి పరిశ్రమ రంగంలోని రైతులను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని రైతులకు మద్దతునిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించింది. చిన్న డైరీ ఫామ్ యజమానులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆ సంస్థ ఎండీ, సీఈఓ మనీష్ షా తెలిపారు.