తెలంగాణ ఆయిల్ ఫాం గెలలు ను కొనుగోలు చేస్తున్న గోద్రెజ్…

– ఓ.ఈ.ఆర్ పెంచుకోవడం కోసం ఆయిల్ఫెడ్ రైతులకు గాలం…
– నివారణ చర్యలు చేపట్టిన టీజీ అధికారులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ ఆయిల్ ఫాం గెలలు మల్లీ సరిహద్దు దాటుతున్నా యి.గతంలో ఇక్కడ రైతులే కొందరు మారు వ్యాపారులు గా మారి మన తెలంగాణా రైతుల గెలలు కొనుగోలు జేసి ఆంధ్రా గోద్రెజ్ కు విక్రయించే వారు.నాడు సరిహద్దు లో సైనికుల్లా నిఘా తో ఆ పద్దతికి స్వస్థి పలికారు.
కానీ నేడు స్వయానా గోద్రెజ్ కంపెనీయే తెలంగాణ రైతులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తూ ఎరవేసి మన ఆయిల్ఫెడ్ గెలలు ను తరలింపుకు పోతున్నారు.
విషయం గ్రహించిన ఆయిల్ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణ అల్లి పల్లి సమీపంలో శనివారం నిఘా పెట్టడంతో అక్రమ రవాణా ఋజువు అయింది.
గోద్రెజ్ మనకు సరిహద్దు ఆయిల్ ఫాం క్షేత్రాలకు దగ్గరగా ఉండటంతో రైతులు సైతం దూరాభారం తగ్గుతుందని చెబుతున్నప్పటికీ ఈ అక్రమ తరలింపు వెనుక గోద్రెజ్ హస్తం ఉన్నట్లు తెలుస్తుంది.గెలలు ధర లు ఆంధ్రా తెలంగాణ కు వ్యత్యాసం లేనప్పటికీ ఈ తరుణంలో దిగుబడి అయ్యే గెలలు లో నూనె శాతం అధికంగా ఉండే కారణంతో గోద్రెజ్ తన పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యే ముడి నూనెలో ఓ.ఈ.ఆర్ శాతం పెంచుకోవడానికి ఈ పధకం పన్నినట్టు ఆయిల్ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా అక్రమ తరలింపు తో ప్రభుత్వ రంగ ఆయిల్ఫెడ్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.