అక్లాండ్: అక్లాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి అమెరికా సంచలనం, టాప్ సీడ్ కోకా గాఫ్, 2వ సీడ్ ఎలీనా స్వీటోలినా ప్రవేశించారు. శనివారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోకా గాఫ్ 6-3, 6-1తో అమెరికాకు చెందిన ఎమ్మా నవ్వారోపై విజయం సాధించింది. ఈ టోర్నీ బరిలోకి నవ్వారో మూడోసీడ్‌గా బరిలోకి దిగింది. మరో సెమీస్‌లో ఎలీనా స్విటోలినా(ఉక్రెయిన్) 2-6, 6-4, 6-3తో చైనాకు చెందిన వాంగ్ షియుపై చెమటోడ్చి నెగ్గింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు స్విటోలీనా పలుమార్లు గాయానికి చికిత్స తీసుకొని మరీ పోరాడి నెగ్గింది. ఆదివారం జరిగే ఫైనల్లో గాఫ్‌తో స్విటోలినా టైటిల్‌కై తలపడనుంది.
యునైటెడ్ కప్ సెమీస్‌కు జర్మనీ
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న యునైటెడ్ కప్ సెమీఫైనల్లోకి జర్మనీ జట్టు ప్రవేశించింది. క్వార్టర్‌ఫైనల్లో జర్మనీ జట్టు 2-0తేడాతో గ్రీస్‌ను చిత్తుచేసింది. పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరేవ్ వరుససెట్లలో స్టెఫొనాస్ సిట్సిపాస్‌ను చిత్తుచేయగా.. మహిళల సింగిల్స్‌లో కెర్బర్ కూడా వరుససెట్లలోనూ మారియా సక్కారిపై ఘన విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో 8వ సీడ్ మరియా సక్కారి 6-0, 6-3తో కెర్బర్‌ని చిత్తుచేసింది. దీంతో 1-1తో మ్యాచ్ సమమైంది. రెండో పురుషుల సింగిల్స్‌లో 7వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ 6-4, 6-4తో సిట్సిపాస్‌ను చిత్తుచేశాడు. ఇక నిర్ణయాత్మక డబుల్స్ మిక్స్ పోటీలో జ్వెరేవ్-లారా సీజ్‌మండ్ జోడీ 6-3, 6-3తో సక్కారి, సిట్సిపాస్ తమ్ముడైన పెట్రోస్‌ను చిత్తుచేశారు.