ఆరు గ్యారంటీల గురించి వివరిస్తూ.. గడపగడపకు తిరుగుతూ.. 

 
నవతెలంగాణ మల్హర్ రావు.
ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఆదివారం మండల ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య మండలంలోని నాచారం,అన్సాన్ పల్లి గ్రామాల్లో  తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల గురించి గడపగడపకు తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేస్తుందన్నారు.మహాలక్ష్మి పథకంప్రతి మహిళకు ప్రతి నెల రూ.2500, గ్యాస్ సిలిండర్ రూ.500, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమన్నారు.రైతు భరోసా పథకం కింద ప్రతి రూ.15000 లు రూ 12000, లు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు వరి పంటకు రూపాయల రూ.500 బోనస్ ఇస్తుందన్నారు.గృహ జ్యోతి పథకం ప్రతి ఇంటికి అవసరాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్,ఇందిరమ్మ ఇంటి పథకం ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు అందించనున్నారు.యువ వికాస పథకం కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, చేయూత పింఛన్ ఆసరా పెన్షన్ రూ.4,000 పెంపు కల్పించనుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఇసనపు రవి,సర్పంచ్ జగన్ నాయక్, మాజీ జెడ్పీటీసీ కొండ రాజమ్మ,గ్రామ శాఖ అధ్యక్షడు కన్నురి రవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.