గోకుల్ తాండ ను పోసానిపేట్ లేదా రామారెడ్డి సొసైటీలో చేర్చాలి: ఎమ్మెల్యేకు గ్రామస్తుల వినతి 

నవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలోని గోకుల్ తండాను ఉప్పల్వాయి సొసైటీలో చేర్చనున్నట్లు తెలియడంతో, పోసానిపేట్ లేదా రామారెడ్డి సొసైటీలో చేర్చాలని బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల మదన్మోహన్రావు పిఏకు గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ నాయక్ మాట్లాడుతూ… గోకుల్ తాండ గతంలో పోసానిపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉండేదని తండావాసులకు పోసానిపేట సౌకర్యంగా ఉంటుందని, లేదంటే మండల కేంద్రమైన రామారెడ్డి సొసైటీలో తాండ గ్రామపంచాయతీని చేర్చే విధంగా ఎమ్మెల్యే కృషి చేయాలని గ్రామస్తుల తరఫున విన్నవిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వసంత్ నాయక్, కారోబరి గంగారం, బాలు నాయక్, రవి నాయక్, హరిచంద్ర నయక్, సుభాష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.