మహిళా డిగ్రీ కళాశాలకు ఆరు విభాగాల్లో బంగారు, వెండి పతకాలు

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 30 డిగ్రీ కళాశాలలకు స్పోర్ట్ మీట్ -2024 నిర్వహించారు. బుదవారం నిజామాబాద్ డిగ్రీ కళాశాలకు చెందిన పలు విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం ఆరు విభాగాల్లో బంగారు, వెండి బహుమతులు కైవసం చేసుకున్నారు. 1. టెన్నికైట్ లో బంగారు పథకం త్రిష, ప్రియతమ, 2. టేబులు టెన్నిస్ వెండి పథకంలో సాయి ప్రసన్న, 3. హైజెంప్ బంగారు పథకంలో రంజిత, 4. రేలే (4×100)మీటర్ బంగారు పతకం, 5. 3000 మీటర్, 800 మీటర్ వెండి పతకం రోజా గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థినులకు, వారికి శిక్షణ ను ఇచ్చిన పిఇటిలను ప్రిన్సిపల్ లావణ్య, ఉపాద్యాయులు అభినందించారు.